సరికొత్త పాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టిన జీహెచ్‌ఎంసీ
- పౌర సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు వార్డు కార్యాలయాలు అందుబాటులోకి
- 150 డివిజన్లలో 150 వార్డు కార్యాలయాల ఏర్పాటు
- కాచిగూడలో వార్డు కార్యాలయం ప్రారంభించిన కేటీఆర్
వికేంద్రీకరణ, ప్రజలు కేంద్రంగా పాలనే తమ లక్షమని ఆయన స్పష్టం చేశారు. వార్డు కార్యాలయాల్లోనే కనీస పౌరసేవలు, ఫిర్యాదులు పరిష్కారమవుతాయన్నారు. ప్రతి డివిజన్ కార్యాలయంలో 10 మంది అధికారుల బృందం ఉంటుందని, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో సమస్యలు పరిష్కారమవుతాయని ట్విట్టర్ వేదికగా తెలిపారు. సిటిజన్ చార్టర్‌కు అనుగుణంగా ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపారు.