ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ ఘనత ఆదిపురుష్ సొంతం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ ఘనత ఆదిపురుష్ సొంతం

Adipurush creates rare record on book my show after RRR
  • భారీ అంచనాలతో ఈ రోజు విడుదలైన ఆదిపురుష్
  • తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ ఖుషీ
  • బుక్ మై షోలో సినిమాకు 10 లక్షలకు పైగా ఇంట్రస్టులు
దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఆదిపురుష్‌ సినిమా పేరు మార్మోగుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ శ్రీరాముడి పాత్రలో నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ రోజు విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా 7వేలకి పైగా థియేటర్లలో ప్రదర్శితం అవుతోంది. మొదటి నుంచే షోనే పాజిటివ్ టాక్ రావడంతో ప్రభాస్ ఖుషీ అవుతున్నారు. 500 కోట్ల పైచిలుకు బడ్జెట్ తో నిర్మితమైన  ఈ చిత్రం విడుదలకు ముందు భారీ బిజినెస్ చేసింది. అన్ని భాషల్లో థియేట్రికల్ రైట్స్ పెద్ద మొత్తానికి అమ్ముడయ్యాయి. తెలుగు రైట్స్ ను 160 కోట్లతో పీపుల్స్ మీడియా కంపెనీ దక్కించుకుంది. 

సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవ్వడంతో నిర్మాతలు రికార్డు స్థాయిలో అత్యధిక థియేటర్లలో విడుదల చేశారు. అంతే కాదు ప్రముఖ ఆన్‌లైన్‌ సినిమా టికెట్‌ బుకింగ్ పోర్టల్‌ ‘బుక్‌ మై షో’లో ఈ చిత్రం ఓ రికార్డు కూడా సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకుని రెండో స్థానంలో నిలిచింది. బుక్ మై షోలో 10 లక్షల మంది ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. ఈ యాప్‌లో ఇప్పటి వరకు 1.75 మిలియన్‌ ఇంట్రెస్టులతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పుడు 1 మిలియన్‌ ప్లస్ లైక్స్‌ తో ‘ఆదిపురుష్‌’ రెండో స్థానం సాధించింది. 

ఇదిలా ఉంటే టికెట్ల విషయంలోనూ ఆదిపురుష్‌ పాత రికార్డులను బద్దలు కొట్టింది. సౌత్‌ ఇండియాతో పాటు నార్త్‌లోనూ ఆదిపురుష్‌ ఓపెనింగ్స్‌లో దూసుకుపోతోంది. సోషల్‌ మీడియా వేదికగా కూడా ఆదిపురుష్‌కి సెలబ్రిటీల నుంచి మద్దతు లభిస్తోంది. సినిమా హిట్‌ కావాలంటూ బాలీవుడ్‌ మొదలు టాలీవుడ్‌ వరకు పలు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్స్‌ చేస్తున్నారు.
Advertisement
Adipurush
RRR
book my show
record

More Telugu News