Adipurush: ఆదిపురుష్ సినిమా ప్రదర్శన ఆలస్యం.. థియేటర్ అద్దాలు పగలగొట్టిన అభిమానులు

Adipurush Screening little bit late fans broken theatre glasses
  • సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని జ్యోతి థియేటర్‌లో ఘటన
  • సౌండ్‌ సిస్టం సరిగా లేదంటూ గొడవ
  • అద్దాలు పగలగొట్టి విధ్వంసం
  • సినిమా ప్రదర్శన నిలిపివేత
ప్రముఖ నటుడు ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా ఓంరౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఆదిపురుష్ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులు సినిమాను ఆలస్యంగా ప్రదర్శించడాన్ని నిరసిస్తూ ఓ థియేటర్ అద్దాలు బద్దలుగొట్టారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని జ్యోతి థియేటర్‌లో జరిగిందీ ఘటన.

సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో యాజమాన్యంతో గొడవకు దిగారు. థియేటర్ యాజమాన్యం వారికి సర్ది చెప్పి లోపలికి పంపింది. అయితే, సినిమా ప్రారంభమయ్యాక సౌండ్ సిస్టం సరిగా లేక, డైలాగులు అర్థం కావడం లేదంటూ మళ్లీ గొడవకు దిగారు. ఆగ్రహంతో ఊగిపోతూ థియేటర్ అద్దాలను పగలగొట్టారు. దీంతో సినిమా ప్రదర్శనను నిలిపివేశారు.
Adipurush
Prabhas
Kriti Sanon
Sangareddy District
Jyothi Theatre

More Telugu News