Chandrababu: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన చిత్తూరు కాంగ్రెస్ నేత సురేశ్ బాబు

  • రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీకి ప్రజలు పట్టం కట్టాలన్న చంద్రబాబు
  • కుప్పంలో లక్ష మెజార్టీ సాధించాలని శ్రేణులకు దిశానిర్దేశం
  • కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటన
leaders joining in tdp in the presence of chandrababu

తమకు సంపద సృష్టించడమేగాక.. సంక్షేమ పథకాలను అమలు చేయడమూ తెలుసని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. సంక్షేమ పథకాలకు నాంది పలికింది మాజీ సీఎం దివంగత ఎన్టీఆర్ అని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరోసారి తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కుప్పంలో లక్ష మెజార్టీ సాధించాలని శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

చిత్తూరు డీసీసీ మాజీ అధ్యక్షుడు సురేశ్ బాబు.. గురువారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. సురేశ్ బాబు, ఆయన అనుచరులకు పార్టీ కండువా కప్పి చంద్రబాబు సాదరంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ, కాంగ్రెస్ నుంచి వందలాది మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘టీడీపీని ఏర్పాటు చేసినప్పటి నుంచి కుప్పంలో పార్టీ జెండానే ఎగురుతోంది. లక్ష మెజారిటీని తీసుకొచ్చే లక్ష్యంతో పని చేస్తామని చెబుతున్న మిమ్మల్ని అభినందిస్తున్నా. పిల్లల భవిష్యత్ బంగారుమయం కావాలంటే, కుప్పం నియోజకవర్గానికి పూర్వ వైభవం రావాలంటే.. టీడీపీని గెలిపించాలి’’ అని పిలుపునిచ్చారు.

చిత్తూరు మాజీ డీసీసీ చీఫ్ సురేశ్ బాబును టీడీపీలోకి తీసుకున్న చంద్రబాబు... నేడు పార్టీ లో చేరుతున్న వారిని మనస్పూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాని తెలిపారు. రాష్ట్రంలో కుప్పం నియోజకర్గం అంటే ఒక గౌరవం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. సురేష్ తండ్రి దొరస్వామి, తాను ఒకే సారి ఎమ్మెల్యేలయ్యాం అని వెల్లడించారు.

More Telugu News