Ram Charan: పెళ్లి రోజు సందర్భంగా రామ్ చరణ్ స్పందన

Ram Charan posts on his wedding anniversary
  • 2012 జూన్ 14న పెళ్లి చేసుకున్న రామ్ చరణ్, ఉపాసన
  • నేటికి 11 ఏళ్లు
  • వైవాహిక జీవితం అద్భుతంగా కొనసాగుతోందన్న రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు నేడు (జూన్ 14) పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. 2012 జూన్ 14న రామ్ చరణ్, ఉపాసన వివాహంతో ఒక్కటయ్యారు. త్వరలోనే ఈ దంపతులు తొలి బిడ్డకు జన్మనివ్వనున్నారు.

కాగా, ఇవాళ పెళ్లిరోజు సందర్భంగా రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. గత 11 ఏళ్లుగా తమ వైవాహిక జీవితం అద్భుతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. లవ్ ఎమోజీతో ఉపాసనను గ్రీట్ చేశారు. తాను, ఉపాసన కలిసున్న ఫొటోను కూడా రామ్ చరణ్ పంచుకున్నారు. వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా రామ్ చరణ్, ఉపాసన దంపతులపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు ఈ సెలబ్రిటీ కపుల్ ను విష్ చేశారు.

  • Loading...

More Telugu News