Telangana: కేసీఆర్ కోసం దీక్ష చేపట్టిన మంత్రి సత్యవతి రాథోడ్ అరికాళ్లకు బొబ్బలు

Minister sathyavathi rathod suffers from blisters on her sole
  • కేసీఆర్ 3వ సారి సీఎం అయ్యేవరకూ చెప్పులు ధరించనని గిరిజన, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దీక్ష
  • ఇటీవల కాలంలో వరుసగా పలు  కార్యక్రమాల్లో చెప్పులు ధరించకుండానే పాల్గొన్న వైనం
  • బుధవారం రాత్రి అరికాళ్లలో బొబ్బలు ఏర్పడటంతో ఆయింట్‌మెంట్ రాసుకున్న మంత్రి
  • తన సంకల్పం నెరవేరే వరకూ దీక్ష విరమించనని స్పష్టీకరణ
కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేవరకూ కాళ్లకు చెప్పులు ధరించబోనని దీక్ష చేపట్టిన గిరిజన, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అరికాళ్లకు బొబ్బలు వచ్చాయి. ఇటీవల వరుసగా పలు కార్యక్రమాల్లో చెప్పుల్లేకుండానే పాల్గొనడంతో ఈ సమస్య తలెత్తింది. 

ఇటీవల ములుగు జడ్పీ అధ్యక్షుడు జగదీష్ అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఎండలో చెప్పులు లేకుండానే నడిచారు. ఇక మంగళవారం కేసముద్రంలో జరిగిన మహిళా దినోత్సవంలోనూ పాల్గొన్నారు. అ క్రమంలో బుధవారం రాత్రి అరికాళ్లకు బొబ్బలు ఏర్పడగా ఆయింట్‌మెంట్ రాయాల్సి వచ్చింది. అయితే, తన సంకల్పం నెరవేరే వరకూ చెప్పులు ధరించేది లేదని మంత్రి స్పష్టం చేశారు.
Telangana

More Telugu News