లండన్ లో తెలుగు విద్యార్థిని దారుణ హత్య.. కత్తితో పొడిచిన బ్రెజిల్ యువకుడు
- యూనివర్శిటీ ఆఫ్ నాటింగ్ హామ్ లో చదువుతున్న తేజస్విని
- ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో తెలుగు అమ్మాయి
- మృతురాలిది హైదరాబాద్ లోని చంపాపేట్
హైదరాబాద్ చంపాపేట్ కు చెందిన తేజస్విని ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్ కు వెళ్లింది. తేజస్విని, అఖిల ఇద్దరూ యూనివర్శిటీ ఆఫ్ నాటింగ్ హామ్ లో చదువుతున్నారు. వీరిద్దరిపై దాడి చేసిన ఉన్మాది 50 ఏళ్ల మరో వ్యక్తిని కూడా పొడిచి చంపేశాడు. హంతకుడిని లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తేజస్విని మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి రప్పించాలని ఆమె కుటుంబసభ్యులు కోరుతున్నారు.