తెలంగాణ సెక్రటేరియట్ కు అంతర్జాతీయ పురస్కారం
- యాదాద్రి, కేబుల్ బ్రిడ్జి సహా 5 నిర్మాణాలకు అవార్డు
- గ్రీన్ యాపిల్ అవార్డులు ప్రకటించిన లండన్ సంస్థ
- స్పెషల్ ఆఫీస్ కేటగిరీలో పోలీస్ కంట్రోల్ టవర్ ఎంపిక
- ఈ నెల 16న లండన్ లో అవార్డుల ప్రదానోత్సవం
హెరిటేజ్ కేటగిరీలో మొజాం జాహీ మార్కెట్ ను గ్రీన్ యాపిల్ అవార్డు వరించగా.. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జికి యూనిక్ డిజైన్ కేటగిరీలో, స్పెషల్ ఆఫీస్ కేటగిరిలో రాష్ట్ర పోలీసుల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు, మతపరమైన నిర్మాణాల కేటగిరిలో యాదాద్రి ఆలయానికి గ్రీన్ యాపిల్ అవార్డు వచ్చింది. తొలిసారి ప్రకటించిన ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవం ఈ నెల 16న లండన్ లో జరుగనుంది.
‘అందమైన భవనాల కోసం ఇంటర్నేషనల్ గ్రీన్ యాపిల్ అవార్డ్స్’ లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున డిపార్ట్‌మెంట్ అర్బన్, రియల్ ఎస్టేట్ సెక్టార్ దరఖాస్తు చేసినట్లు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. తెలంగాణలోని నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు రావడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ అవార్డులను అరవింద్ కుమార్ అందుకోనున్నారు.