Errabelli: కొత్తకోట మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్న ఎర్రబెల్లి

Errabelli gets emotional after looking at Kothakota deadbody
  • హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన కొత్తకోట
  • ఆసుపత్రికి వెళ్లి నివాళి అర్పించిన ఎర్రబెల్లి
  • మంచి మిత్రుడిని కోల్పోయానంటూ కంటతడి పెట్టుకున్న వైనం
మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఈరోజు మృతి చెందిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసుపత్రికి వెళ్లి కొత్తకోట పార్థివదేహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒక మంచి మిత్రుడిని కోల్పోయానంటూ కంటతడి పెట్టుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. 

అనంతరం కొత్తకోట దయాకర్ రెడ్డి భార్య, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డిని పరామర్శించారు. మరోవైపు కొత్తకోట మృతి పట్ల అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Errabelli
brs
Kothakota Dyakar Reddy

More Telugu News