టిపికల్ పోలీస్ ఆఫీసర్ గా బెల్లంకొండ శ్రీనివాస్ .. టైటిల్ ఇదేనట!

Bellamkonda Srinivas New Movie Update
  • మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో బెల్లంకొండ
  • పరిశీలనలో 'టైసన్ నాయుడు' టైటిల్ 
  • త్వరలోనే జరగనున్న కథానాయిక ఎంపిక
  • సంగీతాన్ని అందిస్తున్న భీమ్స్
బెల్లంకొండ శ్రీనివాస్ మంచి ఒడ్డూ పొడుగు ఉన్న హీరో. ఇలాంటి కటౌట్ ఉన్నవారు పోలీస్ ఆఫీసర్ పాత్రలకు బాగా సెట్ అవుతారు. 'రాక్షసుడు' సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా తన సత్తా ఏమిటనేది కూడా ఆయన చాటుకున్నాడు. తాను పోలీస్ ఆఫీసర్ గా చేసిన ఆ సినిమా హిట్ కావడంతో, మరోసారి అదే పాత్రలో కనిపించడానికి ఆయన రెడీ అవుతున్నాడు. 

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తన తాజా చిత్రాన్ని సాగర్ కె చంద్ర దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. ఈ సినిమాలో ఆయన టిపికల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడట. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఈ పాత్ర ఉంటుందని సమాచారం. 

 ఈ సినిమాకి 'టైసన్ నాయుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా టాక్. ఇంతవరకైతే ఈ సినిమా కోసం కథానాయికను తీసుకోలేదు. త్వరలోనే కథానాయిక ఎంపిక ప్రక్రియ కూడా పూర్తవుతుందని అంటున్నారు. రామ్ ఆచంట - గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకి, భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 
Advertisement
Bellamkonda Srinivas
Sagar K Chandra
Tyson Naidu

More Telugu News