కనీసం నన్ను మనిషిగా చూడటం లేదు... వైసీపీ ఎంపీపీ రాజ్యలక్ష్మి కంటతడి

కనీసం నన్ను మనిషిగా చూడటం లేదు... వైసీపీ ఎంపీపీ రాజ్యలక్ష్మి కంటతడి

YCP woman mp weeps over MLA purna chandra prasad
  • ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్ తన పట్ల నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపణ
  • అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని కలెక్టర్ కు ఫిర్యాదు
  • అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానం అందడం లేదని ఆరోపణ   
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్ తన పట్ల నియంతలా వ్యవహరిస్తున్నారని సొంత పార్టీకి చెందిన ఎంపీపీ రాజ్యలక్ష్మి కంటతడి పెట్టారు. అంతేకాదు, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అధికారులు తన విషయంలో ఎలాంటి ప్రోటోకాల్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

మండలంలో ప్రారంభోత్సవాలు, అధికారిక కార్యక్రమాలకు తనకు ఆహ్వానం అందడం లేదన్నారు. కనీసం తనను మనిషిగా చూడటం లేదని వాపోయారు. తాను ఎస్టీ మహిళా ప్రజాప్రతినిధిని కావడం వల్ల తన పట్ల ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Advertisement
YSRCP
mpp

More Telugu News