కొండెక్కిన చికెన్ ధర.. రేటు ఎప్పుడు తగ్గుతుందనే ప్రశ్నకు చికెన్ వ్యాపారుల సమాధానం ఇదే!
- ఆదివారం కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ. 290 - 310
- ఎండలతో కోళ్లు చనిపోతున్నాయన్న వ్యాపారులు
- పూర్తి స్థాయిలో వర్షాలు పడితే ధరలు సాధారణ స్థాయికి చేరుకుంటాయని వివరణ
ఈ ధరలతో సామాన్యుడు షాక్ కు గురయ్యాడు. విపరీతంగా పెరిగిన ధరలతో చికెన్ అమ్మకాలు కూడా 40 శాతం వరకు పడిపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు పెరిగిన ధరలపై చికెన్ వ్యాపారులు స్పందిస్తూ... పెరిగిన ఎండలతో కోళ్లు చనిపోతున్నాయని, కోళ్ల కొరత ఏర్పడటంతో ధరలు పెరిగాయని చెపుతున్నారు. మరో నాలుగు, ఐదు రోజుల వరకు ధరలు తగ్గకపోవచ్చని... వర్షాలు పూర్తి స్థాయిలో పడితే ధరలు సాధారణ స్థాయికి చేరుకుంటాయని తెలిపారు.