East Godavari District: ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు.. ఆరుగురి దుర్మరణం

6 dead in road accident in East Godavari
  • తూర్పుగోదావరి జిల్లాలో ఘటన
  • హైదరాబాద్ నుంచి కారులో వెళ్తుండగా నల్లజర్ల మండలంలో ప్రమాదం
  • మృతుల్లో ముగ్గురు మహిళలు
తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. రాజమహేంద్రవరంలోని ప్రకాశ్‌నగర్‌కు చెందిన 8 మంది హైదరాబాద్ నుంచి కారులో సొంతూరికి బయలుదేరారు. ఈ క్రమంలో కారు జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి శివారుకు చేరుకున్న తర్వాత అదుపుతప్పి ఆగివున్న లారీని ఢీకొట్టింది. 

ఈ ఘటనలో కారులోని ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు, చిన్నారి కూడా ఉన్నారు. గాయపడిన ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
East Godavari District
Road Accident
Nallajerla
Rajamahendravaram

More Telugu News