Khammam District: ఖమ్మం జిల్లాలో ప్రతి రామాలయానికి ఉచితంగా ‘ఆదిపురుష్’ టిక్కెట్లు!

Adipurush free movie tickets for every ram temple in Khammam district
  • జిల్లాలోని ప్రతి గ్రామంలోగల రామాలయానికి 101 ఉచిత టిక్కెట్లు
  • ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించిన శ్రేయస్ మీడియా సంస్థ అధినేత శ్రీనివాస్
  • సొంత డబ్బులతో టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటన
ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 16న విడుదల కానుంది. చారిత్రక రామాయణ గాథ ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. అయితే, రామాయణ పారాయణ జరిగే ప్రతిచోట హనుమంతుడు ఉంటాడన్న నమ్మకంతో ఆదిపురుష్ ప్రదర్శించే ప్రతి థియేటర్‌లో ఓ సీటును ఖాళీగా ఉంచేందుకు చిత్ర బృందం నిర్ణయించిన విషయం తెలిసిందే. 

తాజాగా ఈవెంట్స్ ఆర్గనైజింగ్ సంస్థ శ్రేయస్ మీడియా ఇదే కోవలో మరో నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలోని రామాలయానికి ఉచితంగా 101 టిక్కెట్లు ఇవ్వనున్నట్టు ఆదివారం ప్రకటించింది. తమ సొంత డబ్బులతో ఈ టిక్కెట్లు కొనుగోలు చేసి ఇస్తున్నట్టు శ్రేయస్ మీడియా అధినేత శ్రీనివాస్ మీడియాతో పేర్కొన్నారు.
Khammam District

More Telugu News