Animal: గొడ్డలితో వైల్డ్ ‘యానిమల్’ ఊచకోత.. ఇదిగో ప్రీ టీజర్!

ranbir kapoor sandeep reddy vanga action thriller animal pre teaser out now
  • రణ్‌బీర్ కపూర్‌ హీరోగా ‘యానిమల్’ తెరకెక్కిస్తున్న సందీప్ రెడ్డి వంగ
  • 50 సెకన్ల నిడివితో ‘ప్రీ టీజర్’ రిలీజ్ చేసిన మేకర్స్
  • పంచె కట్టులో రణ్ బీర్.. గొడ్డలితో యాక్షన్ సీన్.. పంజాబీ పాట అదుర్స్
  • ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో సినిమా విడుదల
తొలి సినిమా ‘అర్జున్ రెడ్డి’తోనే సంచలనం సృష్టించారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. తర్వాత అదే సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టారు. బాలీవుడ్ లో జెండా పాతారు. ఇప్పుడు రణ్‌బీర్ కపూర్‌ హీరోగా ‘యానిమల్’ తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 

ఇటీవల రిలీజైన ఫస్ట్‌ లుక్ పోస్టర్.. చాలా మందిని నోరెళ్లబెట్టేలా చేసింది. లవర్ బాయ్ లాంటి రణ్‌బీర్ కపూర్.. గుబురు గడ్డంతో, రక్తం నిండిన బట్టలు, గొడ్డలితో క్రూరంగా కనిపించాడు. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన ‘ప్రీ టీజర్’ అంతకుమించి ఉంది.

50 సెకన్ల నిడివి ఉన్న ‘ప్రీ టీజర్’లో వైల్డ్ గా కనిపించాడు రణ్ బీర్. పంచె కట్టుకుని, చేతిలో గొడ్డలి పట్టుకుని.. మాస్కులు వేసుకున్న ఓ గుంపుపై విరుచుకుపడ్డాడు. ఒంటి చేత్తో ఊచకోత కోస్తాడు. హాలీవుడ్ యాక్షన్ సీన్ చూసినట్లే అనిపిస్తుంది. ఫుల్ టీజర్ లో రివీల్ చేయాలని కాబోలు.. రణ్‌బీర్ మొహాన్ని స్పష్టంగా చూపించలేదు. ఇక ఈ వీడియోలో వినిపించే పంజాబీ పాట.. కాస్త కొత్తగా అనిపించింది.

ఆగస్టు 11న ‘యానిమల్’ను ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ సరసన రష్మిక మందన నటిస్తోంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గుల్షన్ కుమార్, టి-సిరీస్ సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, కృష్ణకుమార్, మురద్ ఖేతాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Animal
Ranbir Kapoor
Sandeep Reddy Vanga
Animal Pre Teaser

More Telugu News