samuthira kani: పిలుపు రావడమే ఆలస్యం.. పవన్ కల్యాణ్ తో వంద సినిమాలైనా చేస్తా: సముద్ర ఖని

samuthirakani said im ready to do even 100 films with pawan kalyan
  • పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో ‘బ్రో’ తెరకెక్కిస్తున్న సముద్ర ఖని 
  • జులై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
  • త్వరలోనే టీజర్ విడుదల చేస్తామన్న సముద్రఖని 
  • పవన్ తో సినిమాలు చేసేందుకు తన దగ్గర చాలా కథలున్నాయని వెల్లడి

హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, దర్శకుడిగా దూసుకుపోతున్నారు సముద్ర ఖని. సీరియల్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి.. స్టార్ హీరోలను డైరెక్ట్ చేయగల స్థాయికి ఎదిగారు. తెలుగు, తమిళ భాషల్లో నటుడిగా, దర్శకుడిగా వరుస సినిమాలు చేస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబోలో ‘బ్రో’ సినిమాను సముద్ర ఖని తెరకెక్కిస్తున్నారు. జులై 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలను సముద్ర ఖని వెల్లడించారు. త్వరలోనే టీజర్ ను విడుదల చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు మొదలుపెట్టినట్లు చెప్పారు. 

పవన్ కల్యాణ్ తో రెండో సినిమా చేస్తారా అని యాంకర్ అడగ్గా.. ‘‘వంద సినిమాలు చేయడానికైనా రెడీగా ఉన్నా’’ అని చెప్పుకొచ్చారు. ‘‘నా దగ్గర చాలా కథలున్నాయి. పవన్ కల్యాణ్ నుంచి పిలుపు రావడమే ఆలస్యం.. సినిమా చేసేందుకు నేను రెడీగా ఉంటా’’ అని తెలిపారు. 

తమిళ ‘వినోదయ సిత్తం’ రీమేక్ గా ‘బ్రో’ సినిమా తెరకెక్కుతుంది. వినోదయ సిత్తం చిత్రంలో హీరోగా నటిస్తూ సముద్ర ఖని దర్శకత్వం వహించారు. తెలుగులోనూ ఆయన తెరకెక్కిస్తున్నారు. థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తోంది.

  • Loading...

More Telugu News