Britain Visa: బ్రిటన్ వీసా ఉంటే చాలు... ఈ  27 దేశాల్లో భారతీయులకు ఫ్రీ ఎంట్రీ

Free entry for Indians with Britsih Visa in these 27 nations
  • అత్యంత కఠిన నిబంధనలతో ఉండే బ్రిటన్ వీసా
  • ప్రపంచంలో చాలా దేశాల్లో బ్రిటన్ వీసాకు విలువ
  • బ్రిటన్ వీసా ఉంటే వీసా ఆన్ అరైవల్ సదుపాయం
వీసా కోసం అమెరికా తర్వాత అంతటి కఠినమైన నిబంధనలు విధించే దేశం బ్రిటన్. యూకే వీసా పొందడం ఏమంత సులువు కాదు. దేశంలోకి వలసలను తగ్గించే క్రమంలో ప్రతి చిన్న అంశాన్ని నిశితంగా పరిశీలించాకే బ్రిటన్ అధికారులు వీసాపై స్టాంప్ వేస్తారు. 

ఇక, బ్రిటన్ వీసా ఉన్న వ్యక్తి చాలా దేశాల్లో నిరభ్యంతరంగా ప్రయాణించవచ్చు... పర్యటించవచ్చు. భద్రతాపరంగా అన్నీ పరిశీలించాకే బ్రిటన్ వీసా ఇస్తారు కాబట్టి... చాలా దేశాలు బ్రిటన్ వీసాతో ఉన్న విదేశీయులను తమ దేశంలోకి వెంటనే అనుమతిస్తుంటాయి. 

ముఖ్యంగా, బ్రిటన్ వీసా కలిగివున్న భారతీయులు ప్రపంచవ్యాప్తంగా 27 దేశాలకు హాయిగా వెళ్లి రావొచ్చు. యూకే వీసా ఉంటే చాలు... నేరుగా ఆయా దేశాల ఎయిర్ పోర్టుల్లో వీసా ఆన్ అరైవల్ పొందొచ్చు. భారతీయులకు అలాంటి సదుపాయం కల్పిస్తున్న దేశాలేవో చూద్దాం.

ఉత్తర అమెరికా...
1. ది డొమినికన్ రిపబ్లిక్ 2. బెర్ముడా 3. కేమన్ ఐలాండ్స్ 4. టర్క్స్ అండ్ కైకోస్ 5. మెక్సికో

దక్షిణ  అమెరికా...
1. పెరు

మధ్య అమెరికా...
1. పనామా

యూరప్...
1. సెర్బియా 2. మాంటెనీగ్రో 3. జార్జియా 4. రిపబ్లిక్ ఆఫ్ నార్త్ మాసిడోనియా 5. ఐర్లాండ్ 6. అల్బేనియా

ఆసియా...
1. ఫిలిప్పీన్స్ 2. సింగపూర్ 3. తైవాన్ 4. ఆర్మేనియా

మధ్యప్రాచ్యం...
1. ఒమన్ 2. బహ్రెయిన్ 3. తుర్కియే 

ఆఫ్రికా...
1. ఈజిప్ట్

కరీబియన్...
1. బహమాస్ 2. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ 3. అరుబా 4. ఆంటిగ్వా అండ్ బార్బుడా 5. ఆంగ్విల్లా

బ్రిటీష్ ప్రాదేశిక భూభాగాలు...
1. జిబ్రాల్టర్
Britain Visa
Indians
Countires
Visa On Arrival

More Telugu News