Iga Swiatek: ఎదురులేని పోలెండ్ అమ్మాయి... ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఇగా స్వైటెక్

  • వరుసగా రెండో ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన స్వైటెక్
  • నేడు మూడు సెట్ల పాటు మహిళల సింగిల్స్ ఫైనల్
  • 6-2, 5-7, 6-4తో కరోలినా ముచోవాపై నెగ్గిన స్వైటెక్
Iga Swiatek claims French Open title again in a row

పోలెండ్ కు చెందిన వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి ఇగా స్వైటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో టైటిల్ కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 22 ఏళ్ల ఇగా స్వైటెక్ 6-2, 5-7, 6-4తో కరోలినా ముచోవాపై విజయం సాధించింది. 

తొలి సెట్ ను సునాయాసంగా చేజిక్కించుకున్న స్వైటెక్... రెండో సెట్ ను ప్రత్యర్థికి కోల్పోయింది. ఓ దశలో వెనుకబడి ఉన్న చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి ముచోవా అనూహ్యరీతిలో పుంజుకుని రెండో సెట్ ను 7-5తో గెలిచింది. నిర్ణయాత్మక చివరి సెట్ లోనూ హోరాహోరీ తప్పలేదు. ఆఖరికి స్వైటెక్ దే పైచేయి అయింది. 

ఇగా స్వైటెక్ గతేడాది కూడా ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ గా నిలిచింది. అదే జోరును ఈ ఏడాది కూడా ప్రదర్శిస్తూ వరుసగా రెండో ఏడాది టైటిల్ ఒడిసిపట్టింది. అంతకుముందు 2020లోనూ ఈ పోలెండ్ అమ్మడే చాంపియన్ గా నిలిచింది. ఓవరాల్ గా మూడు పర్యాయాలు ఫ్రెంచ్ ఓపెన్ ను గెలిచింది.

నేటి ఫైనల్లో కొన్ని ఉత్కంఠభరిత క్షణాలను అధిగమించిన స్వైటెక్ చివరి పాయింట్ సాధించిన అనంతరం తీవ్ర భావోద్వేగాలకు లోనై ఏడ్చేసింది.

More Telugu News