KTR: శర్వానంద్ పెళ్లి రిసెప్షన్ కు హాజరైన మంత్రి కేటీఆర్.... వీడియో ఇదిగో!

KTR attends Sharwanand wedding reception
  • ఇటీవల జైపూర్ లీలా ప్యాలెస్ లో ఘనంగా శర్వానంద్ వివాహం
  • హైదరాబాదులో రిసెప్షన్
  • హాజరైన ప్రముఖులు
  • నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్, రక్షితారెడ్డిల వివాహం ఇటీవల రాజస్థాన్ లోని జైపూర్ లో వేడుకగా జరిగింది. కాగా, శర్వానంద్ తన పెళ్లి రిసెప్షన్ ను హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ విచ్చేశారు. వాస్తవానికి శర్వా... ఇటీవల సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్లి రిసెప్షన్ కు రావాలంటూ స్వయంగా ఆహ్వానించాడు. అయితే ఈ వివాహ విందుకు కేటీఆర్ వచ్చారు. నూతన దంపతులు శర్వానంద్, రక్షితారెడ్డిలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో విక్టరీ వెంకటేశ్ రాగా, ఆయనను కేటీఆర్ ఆత్మీయంగా పలకరించారు.
KTR
Sharwanand
Wedding Reception
Hyderabad

More Telugu News