Nara Lokesh: కృష్ణా జిల్లా వీఆర్ఓ మీనాకు అభినందనలు: నారా లోకేశ్

Lokesh said he appreciates Krishna district VRO Meena
  • మీనా పామర్రు మండలంలో అక్రమ మట్టి లారీలను అడ్డుకుందన్న లోకేశ్
  • మండుటెండలో, 10 నెలల బిడ్డతో వెళ్లి లారీలను అడ్డుకుందని వివరణ
  • విధి నిర్వహణలో మీనా నిబద్ధత స్ఫూర్తిదాయకమని వెల్లడి
కృష్ణా జిల్లాకు చెందిన మీనా అనే వీఆర్ఓను అభినందిస్తున్నట్టు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. మీనా పామర్రు మండలం పసుమర్రులో మట్టి లారీలను అడ్డుకున్నారని వెల్లడించారు. ఆ లారీల్లో అక్రమంగా ఇటుక బట్టీలకు మట్టి తరలిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. మీనా ఎంతో ధైర్యంగా ఆ లారీలను అడ్డుకున్నారని కొనియాడారు. మండుటెండలో 10 నెలల చంటిబిడ్డతో వెళ్లి లారీలను అడ్డుకోవడం మాటలు కాదన్నారు. విధి నిర్వహణలో వీఆర్ఓ మీనా నిబద్ధత స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు.
Nara Lokesh
Meena
VRO
Krishna District
TDP
Andhra Pradesh

More Telugu News