Raghu Rama Krishna Raju: జగన్, వైఎస్ భారతిని విచారించకపోతే వాస్తవాలు బయటకు రావు: రఘురామకృష్ణరాజు

Truth will not come out if not Jagan and YS Bharathi will be questioned says Raghu Rama Krishna Raju
  • వివేకా హత్య కేసులో ఏ9 ఎవరనేది ఆసక్తికరమన్న రఘురాజు
  • వివేకా హత్య గురించి జగన్, భారతికి ముందే ఎలా తెలుసని ప్రశ్న
  • ఫోన్ ద్వారా వారు ఎవరితో మాట్లాడారో తెలియాల్సి ఉందని వ్యాఖ్య
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని ఏ8 నిందితుడిగా సీబీఐ చేర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఈ కేసులో ఏ9 ఎవరనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన విషయమని అన్నారు. సీఎం జగన్, ఆయన భార్య వైఎస్ భారతిని విచారించకపోతే ఈ కేసుకు సంబంధించి ఎలాంటి వాస్తవాలు బయటకు రావని అన్నారు. 

వివేకా హత్య గురించి జగన్ కు ముందే తెలుసని సీబీఐ చెప్పిందని... ఈ విషయం జగన్, భారతికి ముందే ఎలా తెలుసని ప్రశ్నించారు. ఫోన్ ద్వారా వారు ఎవరితో మాట్లాడారో తెలియల్సి ఉందని అన్నారు. మరోవైపు అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సునీత వేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 

Raghu Rama Krishna Raju
Jagan
YS Bharathi
YSRCP
YS Vivekananda Reddy

More Telugu News