Auto car: ఆటోని అచ్చం కారులా మార్చేసుకున్న ఆటోడ్రైవర్

Auto with car like seats colourful lights wows people
  • ఆటోలో కారు మాదిరే కుషన్ సీట్లు
  • లోపల కలర్ ఫుల్ లైటింగ్ తో పాటు డోర్లు ఏర్పాటు
  • ఆటో ఎక్కే ప్రయాణికులకు చక్కని అనుభూతి
సృజనాత్మకత, పట్టుదల ఉంటే చాలు. తమకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చని నిరూపించాడు ఓ ఆటో డ్రైవర్. కారు వేరు, ఆటో వేరు. కారు ప్రయాణానికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అందులోని సీటింగ్ మంచి కుషన్ తో విశాలంగా, మెత్తగా ఉంటుంది. దాంతో ఎంత దూరం ప్రయాణించినా అలసట తెలియదు. అదే ఆటో అయితే అలా కాదు. మంచి రహదారులపై అయితే ఫర్వలేదు కానీ, గతుకుల రోడ్డుపై ఆటోలో ప్రయాణిస్తే ఒళ్లు గుల్ల అవుతుంది. ఎందుకంటే ఆటో సీటింగ్ అంత సౌకర్యంగా ఉండదు.

అందుకే, బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్.. తన ఆటోని కారులా ఎందుకు మార్చుకోకూడదు? అని అనుకున్నాడు. కొంచెం ఖర్చు అయినా ఫర్వాలేదు అనుకుని ఆటోని కారుగా మార్చేసుకున్నాడు. ఆటో లోపల కారు మాదిరి మెత్తటి సీట్లు, లైటింగ్, డోర్లు ఏర్పాటు చేయించాడు. బయటి నుంచి చూస్తే ఆటో మాదిరే ఉంటుంది. కానీ లోపల కూర్చుంటే కారు అనుభూతి కలుగుతుంది. తన ఆటో ఎక్కే ప్రయాణికుల కోసం అతడు చేసిన ఆలోచనను నిజంగా అభినందించాల్సిందే. ఈ ఆటో వీడియోని అజిత్ సహాని అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశాడు.
Auto car
bengalore
colourful lights
wonder

More Telugu News