Disney Hotstar Plus: డిస్నీ హాట్ స్టార్ ప్లస్ లో ఉచితంగా మెగా క్రికెట్ ఈవెంట్లు

Disney Hotstar Plus live telecasts Asia Cup and ICC ODI World Cup for free
  • ఈ ఏడాది సెప్టెంబరులో ఆసియా కప్ పోటీలు
  • అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్ కప్
  • డిస్నీ హాట్ స్టార్ నిర్ణయంతో 54 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు సౌలభ్యం

గత కొంతకాలంగా ఓటీటీ వేదికలు క్రీడా ప్రసారాలకు కూడా సై అంటున్నాయి. తాజాగా, డిస్నీ హాట్ స్టార్ ప్లస్ లో ఆసియా కప్ తో పాటు పురుషుల వన్డే వరల్డ్ కప్ టోర్నీలను లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. అది కూడా పూర్తి ఉచితంగా. క్రికెట్ మజాను వీలైనంత ఎక్కువ మొబైల్ యూజర్లకు చేరువ చేయడమే తమ లక్ష్యం అని డిస్నీ హాట్ స్టార్ ప్లస్ వెల్లడించింది. 

ఆసియా కప్ ఈ ఏడాది సెప్టెంబరులో జరగనుండగా, అక్టోబరు 5 నుంచి 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరగనుంది. డిస్నీ హాట్ స్టార్ నిర్ణయంతో భారత్ లో 54 కోట్ల మంది స్మార్ట్ ఫోన్/ట్యాబ్ యూజర్లు ఉచితంగా క్రికెట్ ప్రసారాలను వీక్షించే అవకాశం కలుగుతుంది.

  • Loading...

More Telugu News