doctor: 16 వేల మందికి గుండె శస్త్రచికిత్సలు చేసిన డాక్టర్ గుండెపోటుతో మృతి!

  • సోమవారం యథావిధిగా విధులు నిర్వర్తించిన డాక్టర్ గౌరవ్
  • మంగళవారం ఉదయం ఆరు దాటినా లేవని డాక్టర్
  • కుటుంబ సభ్యులు కదిలించినా స్పందన లేకపోవడంతో ఆసుపత్రికి తరలింపు
  • అప్పటికే మృతి చెందినట్లు తెలిపిన వైద్యులు
Cardiologist Dr Gaurav Gandhi Who Performed Around 16000 Surgeries

16 వేల వరకు గుండె ఆపరేషన్లు చేసిన గుజరాత్ జామ్ నగర్ కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గౌరవ్ గాంధీ అనూహ్యంగా గుండెపోటుతోనే కన్నుమూశారు. 41 ఏళ్ల ఈ డాక్టర్ మంగళవారం ఉదయం మృతి చెందారు. ఆయన తన వృత్తి కాలంలో దాదాపు పదహారు వేల మంది రోగులకు గుండె ఆపరేషన్లు చేశారు. 

డాక్టర్ గౌరవ్ రోజులానే సోమవారం రాత్రి ఆసుపత్రిలో తన విధులు నిర్వహించుకొని, ప్యాలెస్ రోడ్డులోని తన ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి, ఆ తర్వాత నిద్రపోయారు. రోజూ ఉదయం ఆరు గంటలకే నిద్రలేచే డాక్టర్ చాలాసేపటి వరకు లేవకపోవడంతో కుటుంబ సభ్యులు పిలిచారు. అయినా స్పందించక పోవడంతో కదిలించి చూశారు. ఎలాంటి స్పందన కనిపించలేదు. దీంతో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే గౌరవ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

More Telugu News