Nara Lokesh: సెల్ఫీ ఇవ్వలేదని లోకేశ్ పై గుడ్లు విసిరారు: కడప జిల్లా ఏఎస్పీ వివరణ

Police arrest two persons accused in eggs throwing on Nara Lokesh
  • ఇటీవల ప్రొద్దుటూరులో లోకేశ్ పాదయాత్ర
  • లోకేశ్ లక్ష్యంగా కోడిగుడ్లతో దాడి
  • కేసు నమోదు చేసిన పోలీసులు 
ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై ప్రొద్దుటూరులో కోడిగుడ్లు విసిరిన సంగతి తెలిసిందే. లోకేశ్ పాదయాత్ర చేస్తుండగా, ఆయనను లక్ష్యంగా చేసుకుని కోడిగుడ్లు విసిరారు. అయితే, ఆ గుడ్లు లోకేశ్ భద్రతా సిబ్బందికి తగిలాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేశారు. పెన్నా నగర్ కు చెందిన బాబు, శ్రీకాంత్ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

దీనిపై కడప జిల్లా ఏఎస్పీ ప్రేరణ కుమార్ వివరాలు తెలిపారు. ఈ నెల 1న లోకేశ్ ప్రొద్దుటూరులో పాదయాత్ర నిర్వహించిన సమయంలో... నిందితులు బాబు, శ్రీకాంత్ కోడిగుడ్లు విసిరారని వెల్లడించారు. నిందితులిద్దరూ స్నేహితులని తెలిపారు. సెల్ఫీ ఇవ్వలేదని లోకేశ్ పై గుడ్లు విసిరారని ఏఎస్పీ వివరించారు. బాబు, శ్రీకాంత్ మాట్లాడుకుని గుడ్లు విసిరారని వెల్లడించారు.
Nara Lokesh
Eggs
Police
Yuva Galam Padayatra
Proddutur
Kadapa District

More Telugu News