టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు: ఛార్జిషీట్‌లో 37 మంది నిందితుల పేర్లు!
- త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేయనున్న సిట్
- న్యాయసలహా అనంతరం వచ్చే వారం ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం
- టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఇప్పటి వరకు 50 మంది అరెస్ట్
కీలక నిందితులు ప్రవీణ్, రాజశేఖరరెడ్డితో పాటు పలువురు జైల్లో ఉన్నారు. అనుబంధ ఛార్జిషీట్ లో మిగతా నిందితుల పేర్లను చేర్చనున్నారు. ఇదిలా ఉండగా, డీఈ రమేశ్ అరెస్టుతో ఈ కేసులో ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. రమేశ్ హైటెక్ కాపీయింగ్ చేయించడంతో పాటు 80 మందికి ఏఈ ప్రశ్నాపత్రాన్ని విక్రయించినట్లు దర్యాఫ్తులో వెల్లడైన విషయం తెలిసిందే.