బెంగళూరులో హైదరాబాద్ యువతిని హత్య చేసిన ప్రేమికుడు

Hyderabad girl murdered in Bengaluru
  • జీవన బీమానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • హైదరాబాద్ కి చెందిన అకాంక్ష, ఢిల్లీకి చెందిన అర్పిత్ మధ్య ప్రేమ
  • వేర్వేరుగా ఉండాలని నిర్ణయించుకున్న ఆకాంక్ష... ఆగ్రహానికి గురైన అర్పిత్
  • సోమవారం ఇరువురి మధ్య తీవ్ర ఘర్షణ
  • మెడకు చున్నీని చుట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య
తెలంగాణకు చెందిన ఓ యువతి బెంగళూరులో హత్యకు గురైంది. ప్రేమించిన యువకుడే ఆమెను హత్య చేశాడు. జీవన బీమానగర్ పోలీస్ స్టేషన్ పరిధి కోడిహళ్లిలో ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ కు చెందిన 23 ఏళ్ల ఆకాంక్ష విద్యాసాగర్ సోమవారం రాత్రి హత్యకు గురైంది. ఢిల్లీకి చెందిన అర్పిత్ - ఆకాంక్షలు కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరు కలిసి కోడిహళ్లిలో అద్దెకు ఉంటున్నారు. అయితే ఇటీవల ఇద్దరు వేర్వేరుగా ఉండాలని ఆకాంక్ష భావించింది. ఇది అర్పిత్ కు ఆగ్రహం తెప్పించింది.

వేర్వేరుగా ఉండే విషయమై ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా గొడవ కొనసాగుతోంది. సోమవారం కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో నిందితుడు ఆమె మెడకు చున్నీని చుట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు బెంగళూరు నగర డీసీపీ డాక్టర్ భీమాశంకర్ తెలిపారు. ఆ తర్వాత అక్కడి నుండి పారిపోగా, నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Go Back to Shorts
Bengaluru
Hyderabad
murder

More Telugu News