Jogi Ramesh: ఉద్యోగులపై మంత్రి జోగి రమేశ్ ఆగ్రహం

Jogi Ramesh fires at government employees
  • నీటి పారుదల సలహా మండలి సమావేశానికి ముఖ్య అతిథిగా జోగి రమేశ్ 
  • తాను వేదికపైకి వస్తుండగా గౌరవం ఇవ్వలేదని ఉద్యోగులపై ఆగ్రహం 
  • కిందిస్థాయి ఉద్యోగులకు ఏం నేర్పుతున్నారని అధికారులపై అసహనం
ప్రభుత్వ ఉద్యోగులపై మంత్రి జోగి రమేశ్ చిందులు తొక్కారు. విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశానికి అతిథిగా మంత్రి హాజరయ్యారు. అయితే తాను వేదికపైకి వస్తుండగా కనీసం గౌరవం ఇవ్వలేదని, మంత్రికి గౌరవం ఇవ్వడం తెలియదా? అంటూ ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేశారు. కిందిస్థాయి ఉద్యోగులకు ఏం నేర్పుతున్నారని అధికారులపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. 'మంత్రిని వేదిక మీదకు వస్తున్నాను.. జ్ఞానం ఉందా.. మైండిట్... ఒళ్లు జాగ్రత్త పెట్టుకోండి' అని హెచ్చరించారు. ఆ తర్వాత అధికారుల వైపు తిరిగి ఏం నేర్పుతున్నారు? అంటూ ప్రశ్నించారు.
Jogi Ramesh
Andhra Pradesh

More Telugu News