Botsa Satyanarayana: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం: మంత్రి బొత్స

  • ఉద్యోగ సంఘాలతో ఏపీ మంత్రుల కమిటీ భేటీ
  • ఐదేళ్ల సర్వీసు పూర్తయిన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్న బొత్స
  • కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటుపై కేబినెట్ కమిటీలో చర్చిస్తామని వెల్లడి
Minister Botsa says govt will regularize contract employees

ఉద్యోగ సంఘాలతో ఏపీ మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. 2014 జూన్ 2 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తయిన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని వెల్లడించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కేబినెట్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని బొత్స పేర్కొన్నారు. 

ఇక, ఉద్యోగుల డీఏ, పీఆర్సీ బాకాయిలు 4 ఏళ్లలో 16 వాయిదాల్లో చెల్లిస్తామని వివరించారు. జీపీఎస్ లోనే మెరుగైన అంశాలు చేర్చి అమలు చేస్తామని చెప్పారు. 

గురుకులాల్లో బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచుతున్నట్టు తెలిపారు. వర్సిటీల్లో బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతున్నట్టు వివరించారు. కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటుపై కేబినెట్ భేటీలో నిర్ణయిస్తామని పేర్కొన్నారు.

More Telugu News