Kodandaram: అవసరమైతే మా పార్టీని విలీనం చేస్తాం.. కోదండరాం సంచలన ప్రకటన

telangana jana samithi president kodandaram key comments on party merge
  • ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న కోదండరాం
  • కేసీఆర్ ప్రభుత్వాన్ని దించేందుకు ప్రతిపక్షాలు కలిసి పని చేయాలని పిలుపు
  • వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో అయినా కలిసి పని చేస్తామని ప్రకటన

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ కోదండరాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో అయినా కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ పార్టీతోనైనా పొత్తుకు రెడీ అని తెలిపారు. అవసరమైతే తమ పార్టీని విలీనం చేస్తామని సంచలన ప్రకటన చేశారు.


ఆదివారం సూర్యాపేటలో నిర్వహించిన తెలంగాణ జన సమితి ప్లీనరీ సమావేశాల్లో కోదండరాం మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కలిసి పని చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రజల కోసం ఏ నిర్ణయానికైనా తాము వెనుకాడబోమని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కోదండరాం చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.

  • Loading...

More Telugu News