Rahul Gandhi: న్యూయార్క్ లో రాహుల్ గాంధీతో ‘గ్రీట్‌ అండ్‌ మీట్‌’.. తెలంగాణ కాంగ్రెస్‌ నేతల సందడి

telangana congress leaders dinner with rahul gandhi at newyork
  • ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ
  • న్యూయార్క్ లో జరిగిన కార్యక్రమానికి రేవంత్, వెంకట్ రెడ్డి, మధుయాష్కీ హాజరు
  • న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో భారత్ జోడో యాత్ర ప్రదర్శన
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన తాజాగా వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ‘గ్రీట్‌ అండ్‌ మీట్‌’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 

ఇందులో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సందడి చేశారు. రాహుల్‌ గాంధీతో కలిసి విందులో పాల్గొన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తదితర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా, కాంగ్రెస్ ఓవర్సీస్ ప్రెసిడెంట్ శామ్ పిట్రోడా తదితరులు హాజరయ్యారు.

మరోవైపు న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను భారీ స్క్రీన్ పై ప్రదర్శించారు. తెలంగాణలో ఆయన సాగించిన యాత్ర విశేషాలతో వీడియోను ప్రదర్శించారు. ఈ వీడియోను రేవంత్, ఇతర నేతలు ఆసక్తిగా తిలకించారు.
Rahul Gandhi
Congress
Revanth Reddy
Komatireddy Venkat Reddy
Madhu Yaskhi
New York

More Telugu News