Bandla Ganes: కర్మ కాకపోతే ఇంకేంటి.. టీడీపీ, బీజేపీ పొత్తు వార్తలపై బండ్ల గణేష్ స్పందన!

Bandla Ganesh satirical reacts over TDP and BJP alliance news
  • నిన్న ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు
  • గంట పాటు ఇరువురి మధ్య చర్చలు
  • బాబు పేరు ప్రస్తావించకుండా  ఆయనను విమర్శిస్తూ బండ్ల ట్వీట్
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమిగా పోటీ చేస్తాయన్న వార్తలపై సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై పరోక్షంగా విమర్శలు చేశారు. చంద్రబాబు నిన్న రాత్రి ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు. గంటకుపైగా చర్చలు జరపడంతో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదురబోతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పొత్తును పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో తిట్టిన బీజేపీతో బాబు మళ్లీ కలిసి, ఆ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఆత్మహత్యే అవుతుందని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. దీన్ని రీట్వీట్ చేసిన గణేశ్ .. బాబు పేరు చెప్పకుండా విమర్శలు చేశారు. 

‘కర్మ కాకపోతే ఇంకేంటి. ఆయన సీపీఎం అంటే సీపీఎం అనాలి. ఆయన బీజేపీ అంటే బీజేపీ అనాలి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అనాలి. జనసేన అంటే జనసేన అనాలి. ఆయన కన్వీనెంట్గా ఏ పేరు చెప్తే దాన్ని అందరూ ఫాలో అవ్వాలి. అంతేగాని ఎవరికి ఆత్మాభిమానం, మంచి చెడు, మానవత్వం ఉండదు. ఆయన పొగిడితే జాతిని పోగిడినట్టు. లేకపోతే జాతికి ద్రోహం చేసినట్టు. ఇంతకంటే ఏం కావాలి, దరిద్రం’ అని ట్వీట్ చేశారు.
Bandla Ganes
TDP
bjp
alliance
Chandrababu

More Telugu News