MS Dhoni: పెళ్లి కార్డుపైకి చేరిన ‘ధోనీ’ అభిమానం

MS Dhoni fan from Chhattisgarh prints cricketers pic on his wedding card
  • శుభలేఖ రెండు వైపులా ధోనీ ఫొటో
  • ధోనీ జెర్సీ నంబర్ 7 కూడా ముద్రణ
  • తల అని ప్రస్తావన
  • అభిమానం చాటుతున్న ఛత్తీస్ గఢ్ యువకుడు
టీమిండియా మాజీ కెప్టెన్.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అభిమానులు చాలా ఎక్కువ. మైదానంలో వికెట్ల వెనుక ఎంతో చురుగ్గా, ప్రశాంతంగా కనిపించే ధోనీ అంటే చాలా మందికి ఇష్టమే కాదు ప్రాణం. ధోనీ పట్ల తనకున్న వీరాభిమానాన్ని భిన్నంగా చాటాడు ఓ వ్యక్తి. 

ఛత్తీస్ గఢ్ లోని రాయ్ గఢ్ జిల్లా తమ్నార్ తాలూకా పరిధిలో ఉన్న, కొక్కెల్ గ్రామ వాసి దీపక్ పటేల్ కు ధోనీ అంటే ఎంతో అభిమానం. అతడు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ధోనీ పట్ల తనకు ఎంత అభిమానం ఉన్నదీ పది మందికి తెలియజెప్పాలని అనుకున్నాడు. పెళ్లి శుభలేఖ రెండు వైపులా ధోనీ ఫొటో ముద్రించాడు. ధోనీ జెర్సీ నంబర్ 7ను కూడా వేయించాడు. తల అని కూడా రాయించాడు. ధోనీని తమిళులు తల (నాయకుడు) అని పిలుచుకుంటారు. 

దీపక్ పటేల్ చిన్నప్పటి నుంచి క్రికెట్ ప్రేమికుడు. గ్రామంలో క్రికెట్ జట్టుకు కెప్టెన్ కూడా. దీంతో సహజంగానే ధోనీ అంటే అభిమానం ఏర్పడి, అది మరింత బలపడింది. ధోనీ కెప్టెన్సీ స్ట్రాటజీని ఉపయోగించి తాను కూడా ఎన్నో మ్యాచుల్లో గెలిచానని అతడు చెబుతుంటాడు. ధోనీ అంటే కేవలం అభిమానంతో సరిపెట్టకుండా, ధోనీ అడుగు జాడల్లో నడుస్తున్నట్టు తెలుస్తోంది. 
MS Dhoni
Chhattisgarh
youth
wedding card
dhoni photo

More Telugu News