బాలానగర్ లో ప్రైవేటు బస్సు దగ్ధం
- సుచిత్ర నుండి కూకట్ పల్లి వెళ్తున్న బస్సులో మంటలు
- పెట్రోల్ బంకు సమీపంలో దగ్ధమైన బస్సు
- బస్సులోని డ్రైవర్, ఇద్దరు ప్రయాణికులు సురక్షితం
బస్సు నిలిపిన సమీపంలో పెట్రోల్ బంకు ఉండటంతో అందరూ ఆందోళన చెందారు. రోడ్డుపై బస్సు దగ్ధం కావడంతో కాసేపు ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు మూడు గంటల పాటు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ తో పాటు ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. వీరంతా సురక్షితంగా బయటపడ్డారు.