IPL: చెన్నై గొప్ప.. కాదు ముంబై గొప్ప... బ్రావో, పొలార్డ్ మధ్య ఫన్నీ ఫైట్.. ఇదిగో వీడియో!

On Most Successful IPL Team Dwayne Bravo Kieron Pollard Engage In Hilarious Banter
  • ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్స్ గా చెన్నై, ముంబై
  • చెరో 5 టైటిల్స్ తో తొలి స్థానంలో రెండు జట్లు
  • ఈ విషయంలో సరదగా గొడవ పడిన బ్రావో, పొలార్డ్
  • తానే ఎక్కువ టైటిల్స్ గెలిచానంటూ పొలార్డ్ ను ఆటపట్టించిన బ్రావో
వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్లు డ్వేన్ బ్రావో, కీరెన్ పొలార్డ్ మధ్య పెద్ద తగువే వచ్చింది. మా టీమ్ గొప్ప అంటే మా టీమ్ గొప్ప అంటూ మాటల యుద్ధానికి దిగారు. అంతేనా.. నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ పోట్లాటకు దిగారు. అరే.. ఇద్దరూ వెస్టిండీస్ జట్టు తరఫునే ఆడారు కదా.. పైగా మంచి స్నేహితులు కదా! మరి ఈ గొడవ ఏంటి? అనుకుంటున్నారా? అయితే చదవండి మరి.. 

ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్స్. చెన్నై టీమ్ కి బ్రావో, ముంబై టీమ్ కి పొలార్డ్ ప్రాతినిథ్యం వహించారు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కూడా ఆయా జట్లతో కలిసి పని చేస్తున్నారు. ఐపీఎల్-2023 సీజన్ ముగిసిన తర్వాత ఇద్దరూ విండీస్ కు చేరుకున్నారు.

విండీస్ లో ఇద్దరూ కలిసి ఓ కారులో ప్రయాణిస్తూ ఒక చోట ఆగారు. ‘నువ్వు గొప్పా.. నేను గొప్పా..? నీ టీమ్ గొప్పదా.. నా టీమ్ గొప్పదా..?’ అన్న చర్చకు బ్రావో తెరలేపాడు. ముంబై గొప్పదని పొలార్డ్ అంటే.. చెన్నై మోస్ట్ సక్సెస్ ఫుల్ అని బ్రావో ఎత్తుకున్నాడు. ఇద్దరూ నవ్వుతూనే చర్చ సాగించారు. చివరికి ఎక్కువ ట్రోఫీలు గెలిచిన జట్లలో ఉన్న తానే గొప్ప అని బ్రావో ప్రకటించుకున్నాడు.

వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో బ్రావో షేర్ చేశాడు. ‘‘ఎవరైనా ఈ చర్చను పరిష్కరించడానికి నాకు సాయం చేయగలరా? కీరన్ పొలార్డ్ ఐపీఎల్ లో తన జట్టు (ముంబై ఇండియన్స్) మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ అని నమ్ముతున్నాడు. కానీ నేను ప్రాతినిథ్యం వహించే చెన్నై రికార్డులు చూడండి. పోలార్డ్ ట్రోఫీల గురించి మాట్లాడుతున్నాడు. నాకు ఇది (ఐపీఎల్ 2023 టైటిల్) టీ20 కెరియర్ లో 17వది. ఈ రికార్డులు కూడా అతడికి చూపించండి. పొలార్డ్ ఇంకా 15 ట్రోఫీలతో నాకంటే రెండడుగుల దూరంలోనే ఉన్నాడు. దయచేసి ఎవరైనా ఈ డిబేట్  కు పరిష్కారం చూపించండి..’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
IPL
Dwayne Bravo
Kieron Pollard
CSK
MI
Chennai
Mumbai

More Telugu News