Pawan Kalyan: వారాహి వాహనంతో ప్రజల్లోకి రానున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan set to roll his Varahi vehicle
  • త్వరలో ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్న పవన్
  • పీఏసీ సభ్యులతో నాదెండ్ల మనోహర్ సమావేశం
  • పవన్ యాత్రకు ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచన
రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి పేరిట ప్రత్యేక వాహనాన్ని తయారు చేయించుకున్నప్పటికీ, ఇప్పటిదాకా దాన్ని బయటికి తీయలేదు. అయితే, ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో పవన్ వారాహిని బయటికి తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. త్వరలో పవన్ గోదావరి జిల్లాల్లో పర్యటించనుండగా, వారాహి వాహనంతో ప్రజల్లోకి కదలి రానున్నారు. పవన్ తన వారాహి వాహనంతో రంగప్రవేశం చేసేందుకు ఇదే అనువైన సమయం అని జనసేన వ్యూహకర్తలు భావిస్తున్నారు. 

ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ చేపట్టే యాత్రపై పీఏసీ సభ్యులతో చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించారు. రూట్ మ్యాప్, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించారు. పవన్ యాత్రకు ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కార్యాచరణ సిద్ధం చేశాక పవన్ యాత్రకు తేదీలు ప్రకటిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Pawan Kalyan
Varahi
Janasena
Andhra Pradesh

More Telugu News