పొట్ట పగిలేలా తిన్న చిన్నారి.. పరిస్థితి విషమం

Overeating causes stomach burst in 5 year old girl
  • వెంట వెంట రెండు పుట్టిన రోజు వేడుకలకు హాజరు
  • చిన్నారిని పట్టించుకోని తల్లిదండ్రులు
  • అతిగా తినేయడంతో కింద పడి పొట్టకు తీవ్ర గాయం
  • నాగ్ పూర్ లోని ఆసుపత్రిలో శస్త్రచికిత్స
ఎంత తినాలో తెలియని వయసు అది. పైగా తల్లిదండ్రుల పర్యవేక్షణ కరవైంది. దీంతో కడుపు నిండా తినడం ఐదేళ్ల చిన్నారి పరిస్థితిని విషమంగా మార్చేసింది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ లోని చింద్వారా ప్రాంతంలో చోటుచేసుకుంది. దారుణ విషయం ఏమిటంటే ఈ చిన్నారి తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే కావడం. 

ఒకే రోజు రాత్రి రెండు పుట్టిన రోజు వేడుకలకు బాలికను తల్లిదండ్రులైన డాక్టర్ల జంట తీసుకెళ్లింది. అక్కడ నూడుల్స్ మాదిరి చౌమీన్ ను బాలిక తింది. అక్కడి నుంచి వెంటనే మరో పుట్టిన రోజు వేడుకకు వెళ్లగా, అక్కడ స్వీట్ కార్న్ ను బాలిక తెలియకుండా ఎక్కువ తినేసింది. తర్వాత పిల్లలతో ఆడుకుంటూ మెట్లపై పడిపోయింది. కడుపులో నొప్పి అంటూ తట్టుకోలేకుండా ఏడుస్తుండడంతో, అధికంగా తినడం వల్ల వస్తున్న నొప్పి అనుకున్న తల్లిదండ్రులు యాంటాసిడ్ సిరప్ తాగించారు. అయినా తగ్గలేదు. 

చివరికి కింద పడిపోయిన అరగంటకు చిన్నారిని ఆసుపత్రికి చేర్చారు. కిందపడిపోయినట్టు చెప్పడంతో ఎక్స్ రే తీశారు. ఏమీ తెలియలేదు. హార్ట్ బీట్ ఎక్కువగా ఉండడం, తీవ్ర నొప్పితో పాప తల్లడిల్లిపోతుండడంతో సీటీ స్కాన్ తీశారు. పొట్ట లోపల చీలినట్టు (పగిలిపోవడం/లేజరేషన్) గుర్తించారు. వెంటనే లేపరోటామీ చికిత్స నిర్వహించారు. అనంతరం హైఫ్లో నాసల్ క్యానులాతో వెంటిలేటర్ పెట్టారు. 

30 సెలైన్ బాటిళ్లతో వైద్యులు పాప పొట్టను క్లీన్ చేయాల్సి వచ్చింది. అందుకే పిల్లలు తినే సమయంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరమని కిమ్స్ కింగ్స్ వే హాస్పిటల్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ దీపక్ గోయల్ సూచించారు. 

Go Back to Shorts
Overeating
5 years old
girl
stomach burst
serious

More Telugu News