C Kalyan: ఫస్ట్ డే ఫస్ట్ షో నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ కు ధన్యవాదాలు: సి. కల్యాణ్

First day first show is a very good program says C Kalyan
  • ఫైబర్ నెట్ ద్వారా ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం
  • ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్న పలువురు నిర్మాతలు
  • చిన్ని సినిమాలు బతికేందుకు ఎంతో ఉపయోగకరమన్న కల్యాణ్
సినిమాలు విడుదలైన తొలి రోజే ఫైబర్ నెట్ ద్వారా స్ట్రీమింగ్ చేసే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. దీని వల్ల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్టపోతారని పలువురు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇది గొప్ప కార్యక్రమం అని నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. మారుమూల గ్రామాల్లోని ప్రేక్షకులకు ఇది ఎంతో ఉపయోగకరమని ఆయన చెప్పారు. దీని వల్ల నిర్మాతలకు, థియేటర్లకు ఎలాంటి నష్టం ఉండదని అన్నారు. చిన్ని సినిమాలు బతికేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. కొంత మంది సినిమా వాళ్లు చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఈరోజు విమర్శించిన వారే రేపు ప్రశంసిస్తారని చెప్పారు. ఫస్ట్ డే ఫస్ట్ షో నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు.
C Kalyan
Tollywood
First Day First Show
FIber nET

More Telugu News