Novak Djokovic: జకోవిచ్ చాలా స్పెషల్... ఎందుకంటే ఇందుకే!

This is why Djikovic a very very special person in Tennis
  • పారిస్ లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ
  • మూడో రౌండ్ చేరిన జకోవిచ్
  • ఓ మ్యాచ్ లో బాల్ బాయ్ ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన సెర్బ్ వీరుడు
  • వీడియో వైరల్
పారిస్ లోని రోలాండ్ గారోస్ లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో వరల్డ్ మాజీ నెంబర్ వన్ నొవాక్ జోకోవిచ్ మూడో రౌండ్ కు చేరాడు. కాగా, టెన్నిస్ ప్రపంచంలో జకోవిచ్ కు జోకర్ అనే నిక్ నేమ్ ఉంది. బయటే కాదు, మైదానంలో కూడా జకోవిచ్ ఎంతో సరదాగా ఉంటాడు. 

ఫ్రెంచ్ ఓపెన్ మ్యాచ్ సందర్భంగా జకోవిచ్ ఓ బాల్ బాయ్ ను ఆశ్చర్యానికి గురిచేసిన తీరు అతడి ఉల్లాసభరితమైన మనస్తత్వానికి అద్దం పడుతుంది. జల్లు పడడంతో బాల్ బాయ్ వచ్చి జకోవిచ్ కు గొడుగు పట్టాడు. అయితే బాల్ బాయ్ ను వచ్చి తన పక్కన కూర్చోవాల్సిందిగా జకో కోరాడు. ఆ బాల్ బాయ్ ని తన పక్కన కూర్చోబెట్టుకుని అతడి చేతిలోని గొడుగు తాను తీసుకుని, తన చేతిలోని టెన్నిస్ రాకెట్ అతడికి ఇచ్చాడు. 

అప్పటికే సంభ్రమాశ్చర్యాలకు లోనైన ఆ బాల్ బాయ్ మరింత ఉబ్బితబ్బిబ్బయ్యేలా... జకో ఓ డ్రింక్ ను అతడి చేతికి అందించాడు. తానొక డ్రింక్ అందుకుని ఆ బాల్ బాయ్ కి చీర్స్ చెప్పాడు. దాంతో ఆ టెన్నిస్ స్టేడియం చప్పట్లతో మార్మోగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
Novak Djokovic
Ball Boy
French Open
Tennis

More Telugu News