Akhilesh Yadav: సీఎం పదవి కూడా డీజీపీ పదవి మాదిరి తాత్కాలికమే: అఖిలేశ్ యాదవ్

  • పూర్తి స్థాయి డీజీపీని నియమించడంలో యోగి విఫలమయ్యారన్న అఖిలేశ్
  • యూపీలో బీజేపీ ల్యాండ్ మాఫియాగా రూపుదిద్దుకుందని విమర్శ
  • బీజేపీని ప్రజలు ఇంటికి పంపించే రోజు ఎంతో దూరంలో లేదని వ్యాఖ్య
Akhilesh Yadav comments on Yogi

యూపీ డీజీపీ ఆర్కే విశ్వకర్మ మొన్న పదవీ విరమణ చేశారు. రాష్ట్ర తాత్కాలిక డీజీపీగా విజయ్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై విమర్శలు గుప్పించారు. పూర్తి స్థాయి డీజీపీని నియమించడంలో యోగి విఫలమయ్యారని అన్నారు. డీజీపీనే కాదు, సీఎం కూడా తాత్కాలికమే అని చెప్పారు. 

రాష్ట్రంలో బీజేపీ ల్యాండ్ మాఫియాగా రూపుదిద్దుకుందని అఖిలేశ్ ఆరోపించారు. బీజేపీ నేతలు యథేచ్చగా భూములను ఆక్రమించుకుంటున్నారని విమర్శించారు. వారికి పాలకులు సహకరిస్తున్నారని చెప్పారు. కొత్త పార్లమెంటు ప్రారంభం రోజున రెజ్లర్లను అరెస్ట్ చేశారని... ఈ చర్యతో దేశంలో ప్రజాస్వామ్యం లేదనే విషయాన్ని బీజేపీ నేతలు చెప్పకనే చెప్పేశారని అన్నారు. న్యాయం కోసం ప్రతి వ్యక్తి రోడ్డుపైకి రావాలని బీజేపీ కోరుకుంటోందని విమర్శించారు. బీజేపీని ప్రజలు ఇంటికి పంపించే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పారు.

More Telugu News