అమెరికాలో వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్.. లక్షణాలు ఇవే!
- అన్ని వయసుల వారికి సోకుతున్న హెచ్ఎంపీవీ వైరస్
- యూఎస్ లో అన్ని ప్రాంతాల్లో విస్తరిస్తున్న వైరస్
- దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు
ఈ వైరస్ అన్ని వయసుల వారికి సోకుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై ఈ వైరస్ ఎక్కువ ప్రభావం చూపుతుంది. హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారికి జలుబు లక్షణాలు ఉంటాయి. రెండు నుంచి ఐదు రోజుల వరకు లక్షణాలు ఉంటాయి. ఆరోగ్యవంతులు వారంతట వారే రికవరీ అయ్యే అవకాశం ఉంది. దగ్గు, జ్వరం, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఈ వైరస్ సోకిన వారికి ఉంటాయి. కరోనా వైరస్ మాదిరే ఇది కూడా ఒక మనిషి నుంచి మరో మనిషికి వ్యాప్తి చెందుతుంది.