Ch Malla Reddy: బొజ్జ ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దు: మంత్రి మల్లారెడ్డి

Malla Reddy hilarious comments on police promotions
  • పోలీస్ స్టేషన్లో జిమ్ లు ఏర్పాటు చేయాలని సూచన
  • పోలీసులు ఫిట్ గా ఉండాలన్న మంత్రి
  • దేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని వ్యాఖ్య
బొజ్జ ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దని తెలంగాణ హోం మంత్రి మొహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్ లను మంత్రి మల్లారెడ్డి కోరారు. పోలీసులు ఫిట్ నెస్ పెంచుకోవడానికి పోలీస్ స్టేషన్లలోనే జిమ్ లు ఏర్పాటు చేయాలని అన్నారు. తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రస్తుతం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, మన పోలీసులు బాగా పని చేస్తున్నారని, కేసులను త్వరగా పరిష్కరిస్తున్నారని ప్రశంసించారు. పోలీసుల తమ మాదిరి మంచి ఫిట్ గా ఉండాలని చెప్పారు. పోలీసులను చూస్తే దొంగలు భయపడిపోవాలని అన్నారు. ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Ch Malla Reddy
BRS
Police

More Telugu News