మా వాళ్లను టచ్ చేస్తే నాలోని పాత కొండా మురళి పటేల్ బయటకు వస్తాడు: కొండా మురళి
- వరంగల్ కాంగ్రెస్ లో కొండా, ఎర్రబెల్లి వర్గాల మధ్య విభేదాలు
- నిన్న పరస్పరం దాడి చేసుకున్న ఇరు వర్గాలు
- టికెట్ సురేఖదే అని రేవంత్ రెడ్డి చెప్పారన్న మురళి
ఈ నేపథ్యంలో కొండా మురళి మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొత్తగా వచ్చే వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు చెప్పారు. వరంగల్ తూర్పు టికెట్ కొండా సురేఖదేనని తెలిపారు. టికెట్ సురేఖదే అని మొన్న రేవంత్ రెడ్డి కూడా చెప్పారని అన్నారు.
తన వాళ్లు అయిన కార్యకర్తలు, నాయకులు, యూత్ కాంగ్రెస్ పిల్లలను ఎవరు టచ్ చేసినా... పోలీసులకు చెప్పి మరీ క్రేన్ కు వేలాడదీసి ఉరి వేస్తానని హెచ్చరించారు. ముందుగా పోలీస్ కమిషనర్ కు, ఏసీపీకి చెపుతానని.... వాళ్లు చర్యలు తీసుకోకపోతే మాత్రం... తనలోని పాత కొండా మురళి పటేల్ బయటకు వస్తాడని అన్నారు. మరోవైపు డీసీసీ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ నియమితులయినప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి.