Nara Lokesh: చేనేత రంగం సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉంది: నారా లోకేశ్

  • కడప జిల్లాలో లోకేశ్ పాదయాత్ర
  • చేనేత కార్మికులతో ముఖాముఖి
  • టీడీపీ వస్తే చేనేత కార్మికులను ఆదుకుంటామని భరోసా
  • జగన్ సర్కారు నేతన్నలకు సాయం చేయడంలేదని విమర్శలు
Lokesh held meeting with weavers

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 112వ రోజు ఉత్సాహంగా సాగింది. చౌడూరులో యువగళం పాదయాత్ర ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకర్గంలోకి ప్రవేశించింది. ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో భారీఎత్తున కార్యకర్తలు, అభిమానులు యువనేతకు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యేలు వీరశివారెడ్డి, వరదరాజుల రెడ్డి, టీడీపీ నేత సీఎం సురేష్ నాయుడు, పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు యువనేతను స్వాగతించారు. 

అంతకుముందు, జమ్మలమడుగు నియోజకవర్గం దేవగుడిలో చేనేత కార్మికులతో సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ, తల్లి, చెల్లిని రోడ్డు మీదకి గెంటేసిన జగన్... తల్లి లాంటి కడప జిల్లాకు కూడా తీరని అన్యాయం చేశాడని విమర్శించారు. జగన్ పాలనలో చేనేత కార్మికులు కూడా బాధితులేనని, చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందులపై కనీసం సమీక్ష చేసే తీరిక కూడా జగన్ కు లేదని మండిపడ్డారు. 

చేనేత కార్మికులను ఆదుకుంటాం!

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతపై ఆధారపడిన రంగులు అద్దే కార్మికుల దగ్గర నుండి మాస్టర్ వీవర్ వరకూ అందరిని ఆదుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు. చేనేత క్లస్టర్స్ ఏర్పాటు చేసి ప్రత్యేక బ్రాండింగ్ ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. 

"జగన్ పరిపాలనలో చేనేత ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి తగ్గిస్తాం. నేతన్న నేస్తం అందరికీ ఇస్తానని చెప్పి ఇప్పుడు కేవలం సొంత మగ్గం ఉంటేనే ఇస్తానని జగన్ కండిషన్స్ పెట్టాడు. టీడీపీ హయాంలో ఏడాదికి అన్ని సబ్సిడీలు కలిపి నేతన్నకి సుమారుగా రూ.50 వేలు లబ్ది చేకూరింది. ఇప్పుడు జగన్ పాలనలో కనీసం మేము చేసిన దాంట్లో 10 శాతం కూడా ఇవ్వలేదు" అని స్పష్టం చేశారు.

జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి సాయం చేయలేదు! 

చేనేత కార్మికుల సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని లోకేశ్ వెల్లడించారు. గతంలో టీడీపీ చేనేత కార్మికులను ఆదుకుందని వెల్లడించారు. టీడీపీ పద్మశాలి సామాజిక వర్గాన్ని ఆర్దికంగానూ, రాజకీయంగానూ ఆదుకుందని తెలిపారు. 

"జనతా వస్త్రాల పథకంతో చేనేతకు చేయూత ఇచ్చింది అన్న ఎన్టీఆర్. రూ.110 కోట్ల రుణమాఫీ చేసింది టీడీపీనే. యార్న్, కలర్, పట్టు సబ్సిడీ లు ఇచ్చింది కూడా టీడీపీనే. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సబ్సిడీలు ఎత్తేశారు. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కుటుంబాలకి ఒక్క రూపాయి జగన్ ప్రభుత్వం సాయం చెయ్యలేదు. ఆప్కోని నిర్వీర్యం చేశారు. ఆప్కో చేనేత కార్మికులందరికీ బకాయి పడింది. 

టీడీపీ అధికారంలోకి ఉన్నప్పుడు క్లస్టర్స్ ఏర్పాటు చేశాం. నైపుణ్య శిక్షణ తో పాటు మగ్గం కొనుక్కోడానికి సాయం అందించాం. సబ్సిడీలో చేనేత కార్మికులకు అనేక పరికరాలు అందించాం. జగన్ ప్రభుత్వం చేనేత కార్మికులకు సబ్సిడీ రుణాలు, పరికరాలు ఇవ్వడం లేదు" అని ఆరోపించారు.

*యువగళం వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1446.1 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 10.3 కి.మీ.*

*113 వరోజు పాదయాత్ర వివరాలు (1-6-2023)*

*ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం (కడప జిల్లా):*

సాయంత్రం

4.00 – చౌటపల్లి బాక్స్ క్రికెట్ ప్రాంగణం వద్ద క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.10 – దొరసానిపల్లిలో బుడగజంగాలతో సమావేశం.

4.35 – ప్రొద్దుటూరు ఆంజనేయస్వామి విగ్రహం వద్ద యువతతో సమావేశం.

4.40 – ప్రొద్దుటూరు గాడిదకొట్టాల వద్ద స్థానికులతో సమావేశం.

4.45 – జీవనజ్యోతి స్కూలు వద్ద చేనేతలతో సమావేశం.

4.50 – ఆర్ట్స్ కాలేజి జంక్షన్ వద్ద స్థానికులతో సమావేశం.

5.00 – సాయిబాబా గుడివద్ద స్థానికులతో సమావేశం.

5.05 – వన్ టౌన్ సర్కిల్ లో పర్లపాడు గ్రామస్తులతో సమావేశం.

5.10 – ఎల్ఐసి ఆఫీసు వద్ద క్రిస్టియన్లతో సమావేశం.

5.15 – ఎన్టీఆర్ సర్కిల్ లో స్థానికులతో సమావేశం.

5.20 – అమ్మవారిశాల వద్ద ఆర్యవైశ్య సామాజికర్గీయులతో సమావేశం.

5.25 – బంగారు అంగళ్లు వీధిలో స్వర్ణకారులతో సమావేశం.

5.30 – దర్గా వద్ద ముస్లింలతో సమావేశం.

5.45 – శివాలయం సర్కిల్ లో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.

7.05 – ఆర్ టిసి బస్టాండు వద్ద స్థానికులతో సమావేశం.

7.55 – కొత్తపల్లి రిలయన్స్ జంక్షన్ లో స్థానికులతో సమావేశం.

8.25 – కొత్తపల్లి ఖాదరబాద్ లో స్థానికులతో మాటామంతీ.

8.35 – కొత్తపల్లి శివారు పిఎన్ఆర్ ఎస్టేట్ వద్ద విడిది కేంద్రంలో బస.

******




More Telugu News