Warangal Urban District: వరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు.. కొట్టుకున్న ఇరువర్గాలు

Differences in Warangal Congress
  • ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం రసాభాస
  • ఫ్లెక్సీలో కొండా దంపతుల ఫోటోలు లేకపోవడంపై అనుచరుల ఆగ్రహం
  • ఎర్రబెల్లి, కొండా వర్గాల మధ్య ఘర్షణ 
వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కొండా దంపతుల ఫొటోలు లేకపోవడంపై వారి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కొండా వర్గం, ఎర్రబెల్లి వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలవారు పరస్పరం చెప్పులతో దాడి చేసుకున్నారు.

Warangal Urban District
Congress

More Telugu News