టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో నలుగురి అరెస్ట్
- అరెస్టైన వారిలో వరంగల్ విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజినీర్
- ఏఈఈ, డీఏఓ పరీక్షలకు సంబంధించిన 25 ప్రశ్నాపత్రాల విక్రయం
- ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ద్వారా సమాధానాలు చేరవేసినట్లు గుర్తింపు
ఏఈఈ, డీఏఓ పరీక్షలకు సంబంధించిన 25 ప్రశ్నాపత్రాలను రమేష్ విక్రయించినట్లుగా దర్యాఫ్తులో తేలింది. అంతేకాదు, ఏఈఈ పరీక్షలో ఏడుగురు అభ్యర్థులకు పరీక్ష హాల్లోకి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ద్వారా రమేష్ సమాధానాలు చేరవేసినట్లుగా వెల్లడైంది.