HDFC Bank: ఎక్కువ వడ్డీతో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ప్రవేశపెట్టిన కొత్త ఫిక్సెడ్ డిపాజిట్ల పథకాలు

HDFC Bank launches special FDs with higher interest rate for limited period
  • రెండు రకాల ప్రత్యేక డిపాజిట్ పథకాలపై ప్రకటన
  • 35 నెలలకు 7.20 శాతం, 55 నెలలకు 7.25 శాతం ఆఫర్
  • 60 ఏళ్లు నిండిన వారికి మరో అర శాతం అదనం
ఇప్పటికీ చాలా మంది సామాన్యులు తమ పొదుపు సొమ్మును డిపాజిట్ చేసుకునేందుకు బ్యాంకులకే ప్రాధాన్యం ఇస్తుంటారు. ఎందుకంటే మొదటి నుంచి ఎక్కువ మందికి తెలిసిన స్థిరాదాయ పథకం ఇది. దాదాపు ఎలాంటి రిస్క్ ఉండదు. బ్యాంకుల పట్ల నమ్మకం కూడా ఎక్కువే. దీనికితోడు ఒక్కో డిపాజిటర్ కు రూ.5 లక్షల వరకు బీమా సదుపాయం కూడా ఉంది. బ్యాంకులు ఫెయిలయినా ఒక్కో బ్యాంకు పరిధిలో ఒక్కో డిపాజిటర్ కు రూ.5 లక్షలు లభిస్తాయి. 

మరి బ్యాంకు ఎఫ్ డీ అంటే ఎక్కువ మంది చూసేది రాబడి. మెరుగైన రేటుపై డిపాజిట్ చేయాలనే ఎక్కువ మంది కోరుకుంటారు. అలాంటి వారు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ప్రకటించిన తాజా డిపాజిట్ స్కీమ్ ను పరిశీలించొచ్చు. రెండు రకాల స్పెషల్ ఎడిషన్ డిపాజిట్ స్కీమ్ లను ఈ బ్యాంక్ తీసుకొచ్చింది. 35 నెలల డిపాజిట్ పై 7.20 శాతం రేటును ఆఫర్ చేస్తోంది. ఇక 55 నెలల డిపాజిట్ పై 7.25 శాతం రేటును ఇస్తోంది. ఇక సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు నిండిన వారు) అయితే మరో అర శాతం అధిక రేటును ఇస్తోంది.
HDFC Bank
special FD
higher interest rate

More Telugu News