Tollywood: హీరో శర్వానంద్‌ కారుకు యాక్సిడెంట్

hero sharvanand met with accident
  • శనివారం అర్ధరాత్రి ఫిల్మ్‌ నగర్‌‌ లో బోల్తా కొట్టిన కారు
  • స్వల్ప గాయాలతో బయటపడ్డ శర్వానంద్
  • వచ్చేనెలలో రక్షిత రెడ్డితో ఆయనకు పెళ్లి
మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరో శర్వానంద్‌కు ప్రాణాపాయం తప్పింది. ఆయన కారుకు యాక్సిండెంట్ అయింది. శర్వానంద్ ప్రయాణిస్తున్న రేంజ్‌ రోవర్ కారు శనివారం అర్ధరాత్రి ఫిల్మ్ నగర్‌‌లోని ఓ జంక్షన్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శర్వా స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన కొందరు స్థానికులు ఆయనను ఆసుపత్రికి చేర్చారు. ప్రస్తుతం శర్వానంద్ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది. 

హైఎండ్ కారు కావడంతో, ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో  పెద్ద గాయాలు కాలేదని సమాచారం. ప్రమాదం తర్వాత శర్వా కారు వద్ద నిల్చొని పోలీసులతో మాట్లాడిన వీడియో ఒకటి నెట్‌ లో వైరల్ అవుతోంది. మరోవైపు శర్వా పెళ్లి ఆయన ప్రియురాలు రక్షిత రెడ్డితో జైపూర్‌‌ ప్యాలెస్ లో వచ్చే నెల తొలి వారంలో జరగనుంది. ఇంతలో ఆయనకు ప్రమాదం కావడంతో అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tollywood
sharvanand
Road Accident
Hyderabad

More Telugu News