ఉద్యోగుల కోసమే ఉద్యమం.. నాయకుల ప్రయోజనం కోసం కాదు: బొప్పరాజు
- ఏలూరులో ప్రాంతీయ సదస్సు
- పాల్గొన్న వివిధ జిల్లాల నాయకులు, ఉద్యోగులు
- ఉద్యోగ సంఘాల్లో చీలక తేవడం ద్వారా ఉద్యమాన్ని ఆపలేరన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు
ముఖ్య అతిథిగా హాజరైన బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తమ ఉద్యమం ఉద్యోగుల కోసమే కానీ, నాయకుల ప్రయోజనం కోసం కాదని స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం 80 రోజులుగా ఉద్యమం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల్లో చీలికలు తేవడం ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని బొప్పరాజు తేల్చి చెప్పారు.