Arvind Kejriwal: సుప్రీంకోర్టు తీర్పును కూడా కేంద్రం లెక్కచేయడంలేదు: కేజ్రీవాల్

  • హైదరాబాద్ వచ్చిన ఆప్ ముఖ్యమంత్రులు
  • సీఎం కేసీఆర్ తో కేజ్రీవాల్, భగవంత్ మాన్ సమావేశం
  • అనంతరం ప్రెస్ మీట్
Kejriwal and Bhagwant Mann met CM KCR

హైదరాబాదులో సీఎం కేసీఆర్ తో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సమావేశమైన సంగతి తెలిసిందే. సమావేశం అనంతరం ముగ్గురు సీఎంలు  మీడియా సమావేశం నిర్వహించారు. 

కేజ్రీవాల్ మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్కచేయడంలేదని అన్నారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం అన్ని పార్టీలు ఏకం కావాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. 

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడుతూ, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకే అధికారాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. గవర్నర్ వ్యవస్థను మోదీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని భగవంత్ మాన్ విమర్శించారు. బీజేపీయేతర ప్రభుత్వాలను వేధించేందుకు గవర్నర్ లను వాడుకుంటున్నారని ఆరోపించారు.

More Telugu News